Hyderabad: భరించలేకపోతున్నాం.. సెలవులు ఇవ్వండి
ABN, Publish Date - Nov 08 , 2024 | 07:36 AM
డ్రైనేజీ పైపులైన్ పగిలిపోయి వస్తున్న దుర్గంధంతో బోయగూడ నర్సింగ్ హాస్టల్(Boyaguda Nursing Hostel)లో ఉండలేకపోతున్నామని నర్సింగ్ విద్యార్థినులు గురువారం గాంధీ ఆస్పత్రిని చుట్టుముట్టారు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని, దుర్వాసన కారణంగా సరిగ్గా చదువుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వాలని వారు కోరారు.
- బోయగూడ నర్సింగ్ హాస్టల్‌లో డ్రైనేజీ కంపు
- గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన
- డ్రైనేజీ పైప్‌లైన్‌లు పగిలి నెలరోజుల నుంచి ఇదే పరిస్థితి
- పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం
- గాంధీలో 8వ అంతస్తులో నర్సులకు వసతి ఏర్పాట్లు
హైదరాబాద్: డ్రైనేజీ పైపులైన్ పగిలిపోయి వస్తున్న దుర్గంధంతో బోయగూడ నర్సింగ్ హాస్టల్(Boyaguda Nursing Hostel)లో ఉండలేకపోతున్నామని నర్సింగ్ విద్యార్థినులు గురువారం గాంధీ ఆస్పత్రిని చుట్టుముట్టారు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని, దుర్వాసన కారణంగా సరిగ్గా చదువుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వాలని వారు కోరారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 130 మంది నర్సింగ్ విద్యార్థినులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక వైపు ఉన్న బోయగూడలోని హాస్టల్ ఉంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బ్యాంక్ మేనేజర్ చేతివాటం.. 4.80 కోట్లకు టోకరా
ఆరునెలల నుంచి హాస్టల్‌లో పరిస్థితి దయనీయంగా మారడంతో గాంధీ ఆస్పత్రిని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల నుంచి డ్రైనేజీ దుర్గంధ సమస్య ఉందని, వాసన కారణంగా సరిగ్గా తినలేకపోతున్నామని తెలిపారు. దీనిపై పలుమార్లు గాంధీ సూపరింటెండెంట్ రాజకుమారి(Gandhi Superintendent Rajkumari), నర్సింగ్ సూపరింటెండెంట్‌లతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని నర్సులు చెప్పారు. చివరికి హాస్టల్ నుంచి 2 కి.మీల దూరం నడుచుకుంటూ వచ్చి ఆస్పత్రిని చుట్టుముట్టామని, తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేసేవరకు ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు.
దీంతో దాదాపు మూడు గంటల పాటు ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బోయగూడ హాస్టల్ బాలేకపోతే గాంధీ ఆస్పత్రిలోని 8వ అంతస్తులో నర్సులు ఉండవచ్చని సూపరింటెండెంట్ రాజకుమారి, ఆర్‌ఎంఓ 1, నర్సింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌కు చెప్పారు. అయితే ఆ గదులు దుమ్ముతో నిండి ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రత్యక్ష్యంగా చూపిస్తామని నర్సులు లిఫ్టు ద్వారా 8వ అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, లిఫ్టు ఎక్కకుండా జీడీఎక్స్ సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని, ఆడ పిల్లలు అని చూడకుండా బయటికి ఈడ్చుకొచ్చారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీఎక్స్ సెక్యూరిటీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, నర్సుల గొడవ చేయడంతో గాంధీలోని 8వ అంతస్తును శుభ్రం చేయించారు.
పరీక్షలకు వారం ముందే సెలవులిస్తాం: సూపరింటెండెంట్
గాంధీలో విధులు నిర్వహిస్తున్న నర్సులకు ఈనెల 28 నుంచి పరీక్షలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం పరీక్షలకు వారం రోజుల ముందు మాత్రమే సెలవులు ఇస్తామ ని, అంతకంటే ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చేది లేదని సూపరిండెంటెంట్ స్పష్టం చేశారు. నర్సులు ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బోయగూడ నర్సింగ్ హాస్టల్‌ను బాగు చేయడానికి కొద్ది రోజుల క్రితం రూ.40 లక్షల నిధులు మంజూరు అయ్యాయని త్వరలో హాస్టల్ మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News
Updated Date - Nov 08 , 2024 | 07:36 AM