ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలి..

ABN, Publish Date - Nov 06 , 2024 | 08:51 AM

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు. సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో బేగంపేట, రాంగోపాల్‌పేట్‌ మోండా మార్కెట్‌, బన్సీలాల్‌పేట డివిజన్లకు చెందిన 128 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు. సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో బేగంపేట, రాంగోపాల్‌పేట్‌ మోండా మార్కెట్‌, బన్సీలాల్‌పేట డివిజన్లకు చెందిన 128 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గోల్డ్‌ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..


అనంతరం తలసాని మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని, బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రవేశపట్టిందని గుర్తుచేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 11 నెలల అవుతున్నా ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్న ఆయన, అర్హులకు తులం బంగారం ఎప్పడు ఇస్తారో చెప్పాలన్నారు.


ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీవో, తహసీల్దార్‌కు సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఆర్డీవో సాయిరామ్‌, తహసీల్దార్‌ ఇస్లావత్‌ పాండు నాయక్‌, కార్పొరేటర్లు టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్‌ అత్తిలి మల్లికార్జున్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, వెంకటేషన్‌ రాజు, నాయకులు శ్రీహరి, కిషోర్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 08:51 AM