Hyderabad: కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌పై కొరడా..
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:45 PM
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad City Traffic Police) బ్లాక్ ఫిల్మ్ ఉన్న అద్దాల కార్లపై కొరడా ఝళిపించారు. నాలుగు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1007 కేసులు నమోదు చేసినట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్(City Traffic Additional Commissioner Vishwaprasad) వెల్లడించారు.
- స్పెషల్ డ్రైవ్‌లో రూ.1000 ఫైన్
- 4 రోజుల్లో 1007 కేసులు నమోదు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad City Traffic Police) బ్లాక్ ఫిల్మ్ ఉన్న అద్దాల కార్లపై కొరడా ఝళిపించారు. నాలుగు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1007 కేసులు నమోదు చేసినట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్(City Traffic Additional Commissioner Vishwaprasad) వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్లాక్ ఫిల్మ్‌ను ఏర్పాటు చేసుకుని తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, రూ.1000లు జరిమానా విధించినట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి: Cybercriminals: వామ్మో.. వర్క్ ఫ్రం హోం పేరిట రూ.6 లక్షలు లూటీ చేసేశారుగా..
పౌరసమాజం సైతం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి ఫొటోలు, వీడియోలను వాట్సాప్ నంబర్ 9010203626కు పంపొచ్చు, లేదా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్టు చేయొచ్చని తెలిపారు. వాటిని పరిశీలించి ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 13 , 2024 | 12:45 PM