Hyderabad: పైసలిస్తేనే పనులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, వార్డుబాయ్‌ల దందా
ABN, Publish Date - Dec 06 , 2024 | 07:25 AM
ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి కేరాఫ్ గా మారుతున్నాయి. చాలా దవాఖానల్లో పైసలిస్తే గానీ పనులు జరగడం లేదు. రోగి అడ్మిషన్ మొదలు డిశ్ఛార్జి అయ్యే వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది.
- అడిగినంత ఇస్తేనే త్వరగా వైద్యసేవలు
- అడ్మిషన్ నుంచి డిశ్చార్జి వరకు ఇదే సీన్
హైదరాబాద్ సిటీ: ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి కేరాఫ్ గా మారుతున్నాయి. చాలా దవాఖానల్లో పైసలిస్తే గానీ పనులు జరగడం లేదు. రోగి అడ్మిషన్ మొదలు డిశ్ఛార్జి అయ్యే వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్(Osmania, Gandhi, Nilofer, Sultanbazar) ప్రసూతి ఆస్పత్రి, ఎంఎన్‌జే, సరోజనీదేవి కంటి ఆస్పత్రుల్లో సిబ్బందికి ముడుపులు అందితే కాని పనులు జరగడం లేదని రోగులు వాపోతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు
ఇటీవల పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోగుల వద్ద నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిపై వేటు వేశారు. ‘ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా సిబ్బంది రోగులు, వారి కుటుంబీకుల నుంచి డబ్బులు అడిగితే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి. లంచం తీసుకోవడం నేరం’ అంటూ ఆస్పత్రి గోడలపై మూడు భాషల్లో పోస్టర్లు అంటించారు. ఈ తరహా సమస్య దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఉంది.
బేరసారాలు లేవు
ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది ఎంతడిగితే అంత ముట్టజెప్పాల్సిందే. ఎలాంటి బేరసారాలు ఉండవు. అడిగినంత ఇవ్వకుంటే త్వరగా వైద్యసేవలు అందవు. సిబ్బంది డ్యూటీ మారినా చేయి తడిపితేనే సేవలందుతాయి. ఇవ్వకుంటే అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్, ఆటోలు తీసుకొచ్చిన రోగికి వెంటనే స్ర్టెచర్, వీల్‌చైర్లను ఏర్పాటు చేయరు. క్యాజువాలిటీలో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వార్డు తరలింపునకూ ఎంతోకొంత ముట్టజెప్పాలి. లేకపోతే రోగిని ఎత్తుకొని వార్డులోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మంచి పడక ఏర్పాటు చేయడం, దానిపై బెడ్‌షీట్ మార్చాలంటే కూడా పైసలియ్యాల్సిందే. శస్త్రచికిత్స తర్వాత వార్డు, గదుల తరలింపునకు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
ఆక్సిజన్ ఏర్పాటుకు..
అత్యవసర పరిస్థితుల్లో రోగికి ఆక్సిజన్ ఏర్పాటు చేయాలంటే రూ.200-300 సమర్పించుకోవాల్సిందే. ఆపరేషన్ చేయించుకున్న వారికి, గాయాలైన రోగులకు డ్రెస్సింగ్ సమయంలో డబ్బులడుగుతున్నారు. ఎక్స్‌రే, సీటీస్కాన్ త్వరగా కావాలంటే రూ.50 నుంచి రూ.100 ఇవ్వాలి. నడవలేని రోగిని ల్యాబ్ వద్దకు తీసుకెళ్లాలంటే చేతిలో పైసలు పడాల్సిందే.
ప్రాణవాయువు విషయంలోనూ..
ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నా వాటిని సకాలంలో అందించడంలో సిబ్బంది రోగులకు నరకం చూపిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో సిలిండర్ అమర్చడం ఆలస్యం చేస్తుంటారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో రెండు ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అడిగినంత ఇవ్వకపోడంతో ఓ రోగికి వార్డుబాయ్ ఆక్సిజన్ సిలిండర్ అమర్చకపోవడంతో ప్రాణాలు పోయాయనే ఫిర్యాదులలు అందాయి. నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News
Updated Date - Dec 06 , 2024 | 07:27 AM