ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News: పాతబస్తీలో పేలిన బైక్ పెట్రోల్ ట్యాంక్.. పదిమందికి గాయాలు

ABN, Publish Date - May 12 , 2024 | 09:23 PM

పాతబస్తీలో ఓ బైక్‌కు నిప్పు అంటుకొని బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. ఈఘటనలో పది మందికి గాయాలు అయ్యాయి.ఈ ప్రమాదం భవనీనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనానికి అంటుకున్న మంటలు ఆర్పుతుండగా బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది.బాధితుల్లో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉంది. అందులో ఓ పోలీసు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌: పాతబస్తీలో ఓ బైక్‌కు నిప్పు అంటుకొని బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. ఈఘటనలో పది మందికి గాయాలు అయ్యాయి.ఈ ప్రమాదం భవనీనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనానికి అంటుకున్న మంటలు ఆర్పుతుండగా బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది.బాధితుల్లో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉంది. అందులో ఓ పోలీసు ఉన్నట్లు సమాచారం. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందగానే ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


బైక్‌కు మంటలు ఎలా అంటుకున్నాయో తెలియాల్సి ఉంది. కాగా.. మొఘల్‌పురా అస్లా ఫంక్షన్‌హాల్‌ సమీపంలో రోడ్‌పై వెళ్తోన్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైకర్‌ వెంటనే వాహనాన్ని ఆపేశాడు. మంటలు ఆర్పేందుకు స్థానికులు గుమిగూడారు. ఈ క్రమంలో పెట్రోల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలిపోయింది. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న భవానీ నగర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - May 12 , 2024 | 09:23 PM

Advertising
Advertising