TG News: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్ కేసు.. ఏం జరిగిందంటే
ABN, Publish Date - Oct 18 , 2024 | 10:05 AM
Telangana: మాజీ మంత్రి బంధువులపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది. దండు లచ్చిరాజు అనే వ్యక్తికి మియాపూర్‌లో ఐదు అంతస్థుల ప్రాపర్టీ ఉంది. అయితే మాజీ మంత్రి బంధువులు అక్రమంగా ఆక్రమించుకుని అక్కడే ఉంటున్నారని సదరు బాధితుడు వాపోయాడు.
హైదరాబాద్, అక్టోబర్ 18: మాజీ మంత్రి బంధువులపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తమ ప్రాపర్టీలో మాజీ మంత్రి బంధువులు అక్రమంగా వచ్చి ఉంటున్నారంటూ బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి బంధువులపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది. దండు లచ్చిరాజు అనే వ్యక్తికి మియాపూర్‌లో ఐదు అంతస్థుల ప్రాపర్టీ ఉంది. అయితే మాజీ మంత్రి బంధువులు అక్రమంగా ఆక్రమించుకుని అక్కడే ఉంటున్నారని సదరు బాధితుడు వాపోయాడు.
తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు తన ప్రాపర్టీని ఆక్రమించారని బాధితుడు దండులచ్చిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్‌కు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా!
బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీనోటు తీసుకుని మరీ మాజీ మంత్రి బంధువులు చీటింగ్‌కు పాల్పడ్డారని.. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని ఫిర్యాదు చేశారు. జంపన ప్రభావతి మీద లచ్చిరాజు ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చారని ఆరోపించారు. ఈ విషయంపై 2019 నుంచి లచ్చిరాజు పోరాడుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు అయిన వాళ్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..
KTR: పాలన చేతకాకే పనికిమాలిన మాటలు: కేటీఆర్..
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, పాలన చేతకాకే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మూసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన చేతకాకే పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో కాంగ్రెస్ పార్టీ పొర్లుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు తమకు అంటిన మూసీ బురదను అందరికీ అందించాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందని చెప్పే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (పర్ క్యాపిటా) తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అయ్యింది. మూసీ ప్రాజెక్టులో రూ.1.50 లక్షల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం సాధించింది. బిల్డర్లు, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్ (ITIR)ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక్క రూపాయీ సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతుల విషయంలో 2035 నాటికి చేరుకోవాల్సిన టార్గెట్‌ని 11 ఏళ్ల ముందేగానే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది. దిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైంది. దేశంలోనే ధాన్య సిరిగా మారింది. పేదల కంట కన్నీరు లేకుండానే పారిస్, బొగొటా, మెక్సికో సిటీ, మోంటేరియల్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుంది. మూసీ నదికి అటు ఇటు అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకు?. మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా?. ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ?. కుర్చీలో కూర్చుంటేనో, సమావేశాల్లో తల కిందకీ మీదకీ తిప్పితేనో అభివృద్ధి జరగదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ ప్రభుత్వ బడి పిల్లల పరువు తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు" అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 18 , 2024 | 10:24 AM