Hyderabad: ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు
ABN, Publish Date - Nov 09 , 2024 | 09:25 AM
Telangana: గో టూర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులోని ప్రయాణికులంతా తమ తమ గమ్యాలకు చేరేందుకు సిద్ధమైంది. ఇంతలో అక్కడ జరిగిన ఓ ఘటన వారిని భయాందోళనకు గురి చేసేలా చేసింది. ఈరోజు ఉదయం బస్సు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ వద్దకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్, నవంబర్ 9: నగరంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు వాహనదారులను, పాదచారాలను పరుగులు పెట్టించేలా చేసింది. బస్సు బీభత్సానికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇంతకీ బస్సు సృష్టించిన హంగామా ఏంటి.. పాదచారులు, వాహనదారులు ఎందుకు పరుగులు తీశారో ఇక్కడ చూద్దాం.
గో టూర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులోని ప్రయాణికులంతా తమ తమ గమ్యాలకు చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో అక్కడ జరిగిన ఓ ఘటన వారిని భయాందోళనకు గురి చేసేలా చేసింది. ఈరోజు ఉదయం బస్సు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ వద్దకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద అతివేగంతో దూసుకొస్తున్న బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అదే ఫోర్సులో కారును ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. మరోవైపు ఎంతో నిర్లక్ష్యంతో బస్సు దూసుకురావడంతో వాహనదారులు, పాదాచారులు భయంతో పరుగులు పెట్టారు. అయితే వెనక నుంచి బస్సు దూసుకొస్తున్న విషయం కారులో ఉన్న డ్రైవర్‌కు తెలియదు. కానీ బస్సు బీభత్సాన్ని చూసిన జనం భయంతో కేకలు వేశారు.
వెంటనే తనకు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన కారు డ్రైవర్.. ఒక్కసారిగా కారులో నుంచి బయటకు దూకేశాడు. నిమిషం వ్యవధిలో కారు డ్రైవర్ అందులో నుంచి దూకేసి తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఆ వెంటనే కారును బస్సు బలంగా ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గో టూర్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం తుక్కుతుక్కుగా అయ్యింది. అతివేగం.. అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రావెల్స్ బస్సును, కారును అక్కడి నుంచి తరలించారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అలాగే కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 09 , 2024 | 09:56 AM