TG News: హైదరాబాద్‌లో దారుణం
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:51 AM
Telangana: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ.. ముగ్గురు వ్యక్తుల మాయ మాటలు నమ్మి జీవితాన్ని కోల్పోయింది. ఆమె స్పందించే లోపే దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్, నవంబర్ 5: ఆ మహిళ నిరుపేదరాలు. పొట్ట కూటి కోసం భవనంలో పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎప్పటిలాగే నిన్న కూడా మహిళ భవనంలో పనికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అనుకోని ఆపద ఆమెను చుట్టుముట్టింది. ఆమె స్పందించే లోపే దారుణం జరిగిపోయింది. ముగ్గురు వ్యక్తుల మాయ మాటలు నమ్మి వెళ్లి జీవితాన్నే కోల్పోయింది. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమెకు జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కార్మికురాలిపై ముగ్గురు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితురాలు ఓ భవనంలో పని చేస్తోంది. ఉదయం పనికి వెళ్లిన మహిళ సాయంత్రం భవనంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. హైటెక్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద బస్సు కోసం మహిళ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన ముగ్గురు కామాంధులు ఆటోలో ఆమె వద్దకు వచ్చారు. ఆమెకు మాయ మాటలు చెప్పి వాళ్లతో తీసుకెళ్లారు. ఆపై దారుణానికి పాల్పడ్డారు.
Taj Mahal: బ్యాడ్ న్యూస్.. తాజ్‌మహల్‌ను ఇక అలా చూడలేమేమో..
తమ ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందని మహిళకు చెప్పారు కామాంధులు. దీంతో బట్టలు ఉతికితే డబ్బులు వస్తాయని ఆశ పడిన మహిళ వారితో వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు ఆటోలో మహిళను తీసుకుని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాము ఉంటున్న రూంకు తీసుకువచ్చారు. ఆపై మహిళపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాంధుల అఘాయిత్యంతో మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న ఓ మహిళ అక్కడకు వచ్చి జరుగుతున్న దారుణాన్ని చూసి అవాక్కయ్యింది. అయితే మహిళ రావడాన్ని చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆపై బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి సదరు మహిళకు చెప్పి బోరున విలపించింది. దారుణాన్ని చూసిన సదరు మహిళ మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao: రాహుల్.. అశోక నగరానికి వెళ్లండి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 11:52 AM