Hyderabad: గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్
ABN, Publish Date - Nov 03 , 2024 | 11:44 AM
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి ఎక్కడ చూసినా టపాసుల పేలుళ్లతో నగరం హోరెత్తిపోయింది. దీంతో ఓ వైపు కాలుష్యంతో పాటూ మరోవైపు శబ్ధకాలుష్యం కూడా పెరిగిపోయింది. గడిచిన 48 గంటల్లో నగరంలో గాలి నాణ్యత పూర్తిగా దిగజారింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ సనత్ నగర్‌లో వాయు కాలుష్యం అధికంగా పెరిగినట్లు తెలిసింది.
హైదరాబాద్ : గ్రేటర్ (Greater) లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ (Air pollution) నమోదు అయింది. గడిచిన 72 గంటల్లో సిటీలో గాలి నాణ్యత దిగజారింది. దీపావళి (Diwali) టపాసుల మోతతో శబ్ద, వాయు కాలుష్యం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం మేర ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్ నగర్‌లో అధికంగా వాయు కాలుష్యం పెరిగింది. గాలిలో ప్రమాదకరస్థాయిలో దుమ్ము ధూళి కణాలు పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. సిటీలో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్171కు పెరిగింది. 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా.. సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలో 335 ఐక్యూఐ, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్-2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదు అయినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరించింది.
కాగా హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి ఎక్కడ చూసినా టపాసుల పేలుళ్లతో నగరం హోరెత్తిపోయింది. దీంతో ఓ వైపు కాలుష్యంతో పాటూ మరోవైపు శబ్ధకాలుష్యం కూడా పెరిగిపోయింది. గడిచిన 48 గంటల్లో నగరంలో గాలి నాణ్యత పూర్తిగా దిగజారింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ సనత్ నగర్‌లో వాయు కాలుష్యం అధికంగా పెరిగినట్లు తెలిసింది.
రాష్ట్ర రాజధానిని వాయుకాలుష్యం కమ్మేస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో 171 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతుండటం నగరవాసులను కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6,000 మందికి పైగా మరణాలు సంభవించాయి.
లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి.
నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం.. వాహనాల రద్దీ పెరిగిపోవడం.. పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం వల్లే గాలి నాణ్యత పడిపోతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 17న హైదరాబాద్‌లో గాలి నాణ్యత మంచిగా ఉన్నట్టు గణంకాలు చెబుతున్నాయి. 31 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. దాదాపు పక్షం రోజుల వ్యవధిలో భారీగా మార్పు చెందింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు
మతిస్థిమితం లేని మహిళపై దారుణం..
గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 03 , 2024 | 11:44 AM