ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆకునూరి

ABN, Publish Date - Dec 10 , 2024 | 01:17 PM

యువజన కాంగ్రెస్ ఎన్నికలో సింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆకునూరి అనంత కృష్ణారావు గా అత్యధిక మెజారిటీ తొ గెలుపొందారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా..

Revanth and AK Rao

తెలంగాణలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలు, జిల్లాల వారీ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించి కొత్త యువజన కాంగ్రెస్ అధ్యక్షులను నియమిస్తున్నారు. దీనిలో భాగంగా యువజన కాంగ్రెస్ ఎన్నికలో సింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆకునూరి అనంత కృష్ణారావు గా అత్యధిక మెజారిటీ తొ గెలుపొందారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన యువతకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభలాషులకు, స్నేహితలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు . సికింద్రాబాద్ యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేందుకు ప్రయత్నిస్తామని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రభుత్వంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దన్నారు. సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అనంత కృష్ణారావు తెలిపారు.


కీలకంగా యువజన కాంగ్రెస్..

కాంగ్రెస్ యువజన విభాగమైన యువజన కాంగ్రెస్ ఇటీవల ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంతో శ్రమిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 10 , 2024 | 01:23 PM