Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్
ABN, Publish Date - Oct 13 , 2024 | 09:27 AM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 1 0 గంలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో (Nampally Exhibition Grounds) ఆదివారం అలయ్ బలయ్ (Alai Balai ) కార్యక్రమం జరగనుంది. ఉదయం 1 0 గంలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ (Telangana), హర్యానా (Haryana) గవర్నర్లు (Governors), వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది.
కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే అలయ్.. బలయ్ కార్యక్రమానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ (Vijayalakshmi) ఆహ్వానించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. అలయ్ బలయ్ ఆహ్వాన పత్రికను అందజేసి.. కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలు ప్రతిభింబించేలా.. సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya), ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు.
తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఓ చోట సంఘటితం చేసేందుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరవుతారు. కాగా అలయ్ బలయ్ కార్యక్రమం 19వ వసంతంలోకి అడుగుపెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..
ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి
బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..
సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 13 , 2024 | 09:27 AM