ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్...

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:28 PM

Telangana: జానీ మాస్టర్‌పై మహిళా కోరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలను సుమలత ఖండించారు. మహిళా కోరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కోరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Jani Master Case

హైదరాబాద్, అక్టోబర్ 2: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరయ్యారు. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్‌లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు ఈరోజు (బుధవారం) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు.

Bathukamma History: వెయ్యేళ్ల బతుకమ్మ చరిత్ర మీకు తెలుసా?


ఈ సందర్భంగా జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలను సుమలత ఖండించారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు (గురువారం) జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు తీర్పును వెల్లడించనుంది.

Sensational: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ సంచలనం


కాగా.. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఇటీవల ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత తెలిపింది. ‘‘ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్‌పై తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే... ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను’’ అంటూ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌‌కు సుమలత ఫిర్యాదు చేసింది.


ఇవి కూడా చదవండి...

KTR: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఏమన్నారంటే

Seethakka: మా నోళ్లు కాదు.. నీ నోరే యాసిడ్‌తో కడగాలి.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 04:46 PM