Vice Chancellor: తెలంగాణలో 9 యూనివర్సిటీలో వీసీల నియామకం
ABN, Publish Date - Oct 18 , 2024 | 03:35 PM
Telangana: తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌ల నియామకపత్రాలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకాలు చేశారు. దీంతో వీసీలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. .
హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు (Universities in Telangana) వైస్ ఛాన్సలర్‌లు (Vice Chancellors) నియమితులయ్యారు. వైస్ ఛాన్సలర్‌ల నియామకపత్రాలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) సంతకాలు చేశారు. దీంతో వీసీలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. .
వైఎస్ చాన్సలర్లు ఎవరంటే...
1. ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ - మహబూబ్‌నగర్, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్
2. ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి - కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్
3. ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్ - హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్
4. ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ - శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్‌కు వైస్ ఛాన్సలర్
5. ప్రొఫెసర్ నిత్యానందరావు - హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్
6. ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ - నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్
7. ప్రొఫెసర్ యాదగిరిరావు - తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌కు వైస్ ఛాన్సలర్
8. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య - జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్‌కు వైస్ ఛాన్సలర్
9. ప్రొఫెసర్ రాజి రెడ్డి - శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్
దాదాపు ఏడాది కాలంగా...
కాగా.. తెలంగాణలో చాలా కాలంగా వీసీల పోస్టులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంగా వీసీలు లేకుండా పోయారు. అంతేకాదు ఇన్‌చార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్‌లను నియమించినప్పటికీ వర్సిటీలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. వీసీలు లేక అనేక యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పినట్లైంది. పలు వర్సిటీల్లో అక్రమాలు జరిగాయని కూడా ఆరోపణలు వచ్చాయి. సరైన వసతులు లేక అనేక సార్లు విద్యార్థులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని కొత్త వీసీలను నియమించాలని విద్యార్థులు పట్టుబట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వసతి గృహాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. హాస్టల్స్‌లో సరైన భోజన సదుపాయం లేక, నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు అవస్థలు పడ్డ సందర్భాలు ఎన్నో. అంతేకాకుండా హాస్టల్స్‌లో విషపు పురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు మరింత భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి.అలాగే వీసీ పోస్టుల కోసం అనేక మంది ప్రొఫెసర్లు పైరవీలు చేసినట్లు సమాచారం. చివరకు ఎట్టకేలకు వీసీల నియామకంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వీసీల ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి
Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 18 , 2024 | 03:53 PM