ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gadwal Vijayalakshmi: హైదరాబాద్ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు..

ABN, Publish Date - Oct 13 , 2024 | 09:56 PM

నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi)పై బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) కేసు నమోదు చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో హంగామా చేశారంటూ ఆమెపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

Hyderabad Mayor Gadwala Vijayalakshmi

హైదరాబాద్: నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi)పై బంజారాహిల్స్ పోలీసులు (Banjara Hills Police) కేసు నమోదు చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో హంగామా చేశారంటూ ఆమెపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిర్దేశిత సమయం దాటినా పోలీసులు అనుమతించిన డెసిబుల్స్ కంటే భారీ శబ్దాలతో స్థానికులకు ఇబ్బందులు కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.


విజయలక్ష్మితోపాటు ఈవెంట్ నిర్వాహకులు విజయ్ కుమార్, గౌస్‌‌పైనా కేసు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలో మతపరమైన కార్యక్రమాలకు డీజేలు, బాణసంచా వాడకాన్ని పోలీసులు నిషేధించారు. సౌండ్ సిస్టమ్‌లకు అనుమతులు ఇచ్చినప్పటికీ పోలీసులు నిర్దేశించిన పరిమిత డెసిబుల్స్‌లోనే సౌండ్ పెట్టాలి. దాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామంటూ ఇటీవల నయా రూల్స్ జారీ చేశారు.


అయితే ఈనెల 10న అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా విపరీతమైన శబ్దాలు చేస్తున్నారంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మేయర్, ఆమె అనుచరులు వేడుకలు చేసుకోవద్దా? అంటూ పోలీసులను ప్రశ్నించారు. వారు చెప్పినా వినకుండా వాయు కాలుష్యానికి పాల్పడ్డారు. భారీ శబ్దాలతో పెట్టిన డీజే పాటలకు విజయలక్ష్మి నృత్యాలు సైతం చేశారు. అయితే దీనిపై పోలీసులు అక్టోబర్ 13న సుమోటోగా కేసు నమోదు చేశారు. స్థానికులు కూడా కొంతమంది ఆమెపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులతో మేయర్ వాగ్వాదానికి దిగిన వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొట్టాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

Warangal: వరంగల్‌లో భగ్గుమన్న కాంగ్రెస్‌ వర్గ విభేదాలు.. పరిస్థితి ఉద్రిక్తం..

Pro Saibaba: సాయిబాబా భౌతిక కాయాన్ని ఆసుపత్రికి అప్పగిస్తాం.. కుటుంబ సభ్యుల ప్రకటన

Mallu Ravi: సీఎం రేవంత్ రెడ్డి నిశ్శబ్ద విప్లవ నాయకుడు: ఎంపీ మల్లు రవి..

Updated Date - Oct 13 , 2024 | 09:58 PM