ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు

ABN, Publish Date - Sep 30 , 2024 | 08:33 AM

రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు దీక్ష నిర్వహించనుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొననున్నారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) పోరుకు సిద్ధమైంది. సోమవారం ఇందిరా పార్క్ (Indira Park) ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష (Deeksha) చేపట్టనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష చేయనుంది. రైతు హామీల (Farmer guarantees) అమలు సాధన పేరిట 24 గంటల పాటు దీక్షకు బీజేపీ పిలువునిచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటల నుండి మంగళవారం ఉదయం 11 వరకు దీక్ష కొనసాగనుంది. రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీ అమలపై బీజేపీ దీక్ష చేయనుంది. ఈ నిరసన దీక్షలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.


ఎంపీ ఈటల మాట్లాడుతూ..

రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇందిరా పార్కు సమీపంలోని ధర్నాచౌక్‌లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు రైతు హామీల సాధన దీక్ష ఉంటుందని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని వివరించారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం లేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్‌, కౌలు రైతులకు రైతుబంధు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు.. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఈటల రాజేందర్‌ విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అరాచక పాలన చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. లక్షలాది మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందని.. దానికి నిరసనగా దీక్ష చేపడుతున్నామని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ సమగ్రంగా అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు.

కాగా ఇప్పటికే ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షా స్థలితో పాటు ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకుంది. ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం

నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!

బాబోయ్.. 100కిపై మొసళ్లను చంపేసిన రైతు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 30 , 2024 | 09:43 AM