ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన

ABN, Publish Date - Oct 25 , 2024 | 09:11 AM

హైదరాబాద్ నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి మహా ధర్నాకు బీజేపీ ప్లాన్ చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బాధితులతో మహాధర్నా నిర్వహిస్తారు.

హైదరాబాద్: హైడ్రా (Hydra), మూసీ పునరుజ్జీవనం (Musee Renaissance) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.,) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ (BJP) శుక్రవారం ఇందిరా పార్క్ (indira Park) వద్ద ఆందోళనకు (Protest) పిలుపిచ్చింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు , ఎమ్మెల్యేలు సందర్శిస్తారు. బాధితులతో ముఖా ముఖి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 11గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.

కాగా హైదరాబాద్ నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి మహా ధర్నాకు బీజేపీ ప్లాన్ చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బాధితులతో మహాధర్నా నిర్వహిస్తారు. ఈ నెల 23 , 24 తేదీల్లో బీజేపీ నేతలు వరుసగా కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ బాధిత పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ నేతలు 9 బృందాలుగా ఏర్పడి పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు.


మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ఊరుకోదని పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, మూసీపై సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. డీపీఆర్ ఇవ్వకుండా అఖిలపక్షం మీటింగ్ ఏంటని ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సుందరీకరణ చేస్తే తాము మద్దతు ఇస్తామని బీజేపీ నేతలు అన్నారు.

రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

అలాగే ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది. ముఖ్యంగా రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేవరకూ వదలిపెట్టబోమని హెచ్చరించింది. బీఆర్‌ఎస్‌లాగే మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని కుండబద్ధలు కొట్టింది. లక్షలాది మంది రైతాంగానికి అండగా ఉంటామని ప్రకటించింది. రూ.2 లక్షల రుణమాఫీకి ఆంక్షలెందుకు విధించారని నిలదీసింది. రైతుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. వారినే దారుణంగా మోసం చేస్తోందని మండిపడింది. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయాడు..

అమరావతికి రైల్వే లైన్‌..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 25 , 2024 | 09:11 AM