ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DK Aruna: అల్లు అర్జున్‌పై వేధింపులకు కారణం అదే.. డీకే అరుణ సంచలన కామెంట్స్

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:48 PM

Andhrapradesh: హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ను వేధించడం వెనక అసలు కారణం వేరే ఉందంటూ కామెంట్స్ చేశారు. అది త్వరలోనే బయటకు వస్తుందన్నారు.

BJP MP DK Aruna

హైదరాబాద్, డిసెంబర్ 24: ఐకానిక్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Hero Allu Arjun), ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వేధించడం వెనుక అసలు మతలబు వేరే ఉందని.. అది త్వరలో తేలుతుందంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ (BJP MP DK Aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) ఎంపీ మాట్లాడుతూ.. ఇలాంటి కక్ష సాధింపు దోరణిని తాను ఎప్పుడు చూడలేదన్నారు. అసెంబ్లీలో అసలు సమస్యలు లేవన్నట్లు ఎంఐఎం వాళ్ళతో అడిగించుకుని మరీ సీఎం సభలో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీకి సూట్ కేసులు పంపించే అంశంలో ఎక్కడో చెడిందని.. అందుకే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

AP News: విజయవాడ కోర్టుకు తెలంగాణ ఏపీ ప్రజాప్రతినిధులు


రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి కచ్చితమైన కారణం ఉంటుందన్నారు. మంత్రి సీతక్క తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీసులను హీరోలుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయన్నారు. ఏడాదిలో ఇచ్చిన హామీలపై జనం ఎక్కడ అడుగుతారో అని రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వాళ్ళే ఉన్నారని తెలిపారు. అంటే దీని వెనక ఇంకా ఏదో బలమైన కారణం ఉందని సందేహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి కానీ ఇలా చిల్లర పాలిటిక్స్ చేయద్దు అంటూ ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.


పోలీసుల ఎదుట అల్లు అర్జున్

మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్.. పోలీసుల విచారణను ఎదుర్కుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈరోజు ఉదయం చిక్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. గంటకు పైగా విచారణ సాగుతోంది. అల్లు అర్జున్ ఇస్తున్న స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. కేసు విచారణను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన మరుసటి రోజే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టారు.


సంధ్య థియేటర్‌కు మరోసారి అల్లు అర్జున్

తొక్కిసలాటలో రేవతి మృతి చెందినట్లు రెండు రోజులు తరవాత తెలిసిందని మీడియా ముందు బన్నీ చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో విచారణను ప్రభావితం చేస్తున్నట్లే అని పోలీసులు చెబుతున్నారు. కేసు విచారణ దశలో ఉండగా విషయాలు బయటకి చెప్పడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. ఎందుకు ఇన్వెస్ట్‌గేషన్‌లో ఉండగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పావని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఘటన జరిగిన రోజు పోలీసులు తన దగ్గరకు రాలేదని అల్లు అర్జున్ చెప్పగా.. అల్లు అర్జున్ కామెంట్స్ తరువాత పోలీసులు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొస్తున్న వీడియోను హైదరాబాద్ సీపీ రిలీజ్ చేశారు. మీడియా ముందు ఎందుకు అబద్ధం చెప్పారంటూ అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించగా.. ఆయన ఇచ్చి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు

పోలీస్ స్టేషన్‌కు పుష్ప

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 01:00 PM