Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్
ABN, Publish Date - Oct 30 , 2024 | 09:54 AM
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు. పోలీసులు అప్రమత్తమయ్యారుు. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విమానాలకు (Airplanes) బెదిరింపు కాల్స్ (Bomb threat calls ) వస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (Indigo) విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు. పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులు కిందకు దింపి చెక్ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణీకులు భయాందోళనలు చెందుతున్నారు.
కొనసాగుతున్న విచారణ..
బాంబు బెదిరింపు కాల్స్‌పై అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కాల్స్ తరచూ వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రయాణికులు దైర్యంగా ఉండాలని, భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు ఎవరు కాల్ చేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తరచూ బెదిరింపు కాల్‌లు..
అయితే శంషాబాద్ ఒక్కటే కాదు.. భారత్ కు చెందిన వివిధ విమానాలకు వారం రోజుల వ్యవధిలో 100కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెదిరింపు ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నారో కనిపెట్టేందుకు తమకు సహకరించాలని ఎక్స్, మెటా యాజమాన్యాన్ని కోరింది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఎక్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లైయింగ్ లిస్టులో చేర్చుతామని, అందుకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేస్తామని చెప్పారు.
దేశవ్యాప్తంగా పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 100 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలకు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వచ్చినట్లు ఏవీయేషన్ అధికారులు వెల్లడించారు. మొత్తం చూసుకుంటే గత 16 రోజుల వ్యవధిలో ఏకంగా 510 జాతీయ, అంతర్జాతీయ విమానాలకు సోషల్ మీడియా వేదికగా ఏవీయేషన్ సెక్యూరిటీకి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ..
శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..
శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 30 , 2024 | 09:54 AM