BJP: ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం: బూర నర్సయ్య గౌడ్
ABN, Publish Date - Feb 05 , 2024 | 09:46 PM
ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) అన్నారు.
హైదరాబాద్: ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ లంకె బిందెలు ఇవ్వటానికి కేంద్రం రెడీగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పధకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మ యోజనకు ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలని.. కానీ ఇప్పటి వరకు చేయలేదని చెప్పారు. కనీసం 4వేల మందికి సంబంధించిన వివరాలు కూడా వెరిఫై చేయలేదన్నారు. ఇప్పటికే గ్రాంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని తెలిపారు.
వెరిఫికేషన్ పూర్తి చేస్తే లబ్ధిదారులకు నిధులు అందుతాయని తెలిపారు. నల్లగొండలో ఎస్ఎల్ పీసీ ప్రాజెక్టుకు 500 లేదా 600 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్‌కు చేతులురాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బకరిపై మరొకరు పోటీ పడి విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కృష్ణా జల వివాదంపై బీజేపీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే శూన్యమని.. ఆ పార్టీ గల్లీలో... ఢిల్లీలో కూడా లేదని ఎద్దేవా చేశారు.బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Feb 05 , 2024 | 09:46 PM