ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Organ Donation: విద్యార్థి అవయవదానం... సెల్యూట్ చేసిన ఆస్పత్రి యాజమాన్యం

ABN, Publish Date - Mar 18 , 2024 | 01:45 PM

Telangana: కోకాపేటలో మరో హిట్‌ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్‌ను ఓ ఆటో ఢీకొట్టి.. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తమ బిడ్డ ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

హైదరాబాద్, మార్చి 18: అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అంటారు. అలాగే సాటి మనిషి ప్రాణాలను బతికించే అవయవ దానం (Organ Donation) కూడా అంతకంటే గొప్పది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొందరు వ్యక్తులు వారి అవయవాలు దానం చేస్తూ... తాము చనిపోతూ మరికొందరి ప్రాణాలు నిలుపుతుంటారు. తాజాగా ఓ విద్యార్థి కూడా అవవదానం చేసి హాట్సాఫ్ అనిపించుకున్నాడు.

అసలేం జరిగిందంటే..

నగరంలోని కోకాపేటలో మరో హిట్‌ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్‌ను ఓ ఆటో ఢీకొట్టి.. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తమ బిడ్డ ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆ విషాదంలోనూ విద్యార్థి పేరెంట్స్ మానవత్వాన్ని చాటుకున్నారు. బిస్వాల్ ప్రభాస్ అవయవాలు దానం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. విద్యార్థి లివర్, కిడ్నీలు దానం చేశారు. అవయవ దానం చేసిన బిస్వాల్ ప్రభాస్‌కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి తెలిపింది.

ఇవి కూడా చదవండి..

Chandrababu: చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. కారణమేంటంటే..

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 18 , 2024 | 02:04 PM

Advertising
Advertising