Balka Suman: తెలంగాణలో ఉపఎన్నికలు.. బాల్క సుమన్ సంచలన కామెంట్స్
ABN, Publish Date - Oct 04 , 2024 | 02:45 PM
Telangana: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్స్ జరుగుతాయనేది గులాబీ నేతల మాట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో..
హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణలో (Telangana) ఉపఎన్నికల అంశం తరుచూ వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ఖాయమని బీఆర్‌ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్స్ జరుగుతాయనేది గులాబీ నేతల మాట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుపు తథ్యమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ (BRS Leader Balka Suman) సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu Naidu: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: సీఎం చంద్రబాబు
చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అని బాల్క సుమన్ స్పష్టం చేశారు. సూటుకేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే జైలుకు పోవటం ఖాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరన్నారు. ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తామని వెల్లడించారు. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు.
తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైందని విమర్శించారు. పోలీసులు రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారని మండిపడ్డారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని హెచ్చరించారు. ఈడీ విచారణ జరుగుతోన్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ తాజా పరిణామాలను తెలంగాణ పోలీసులు గుర్తుంచుకోవాలని తెలిపారు. జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైంది.. తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు ఇంటికి పంపారన్నారు. చేసిన తప్పుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు.
AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్
కాగా.. ఈఏడాది మొదట్లో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకా ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో వివేకా ఈడీ ముందు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఈడీ విచారణ జరిపింది. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీస్ మధ్య రూ. 8 కోట్ల లావాదేవీలకు సంబంధించి గతంలో హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.
దర్యాప్తులో భాగంగా గడ్డం వివేక్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత ఏడాది నవంబరులో ఈడీ అధికారులు వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీల పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో లభించిన పత్రాలు, డిజిటల్ ఆధారాల మేరకు ఈడీ గుర్తించింది. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు లెక్కల్లో చూపించినా... వారి మధ్య కేవలం లక్షల్లోనే నగదు లావాదేవీలు జరిగినట్లు సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా ఈడీ గుర్తించినట్లు సమాచారం. వివేక్‌కు సంబంధించిన సంస్థల్లో విదేశాల నుంచి లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు కనుగొన్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
KTR: రుణమాఫీపై ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలే..
TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 04 , 2024 | 03:18 PM