ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: పోలీసులతో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ నేతలు

ABN, Publish Date - Feb 14 , 2024 | 01:59 PM

హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియా పాయింట్‌కు వెళ్ళే మార్గంలో కింద కూర్చుని నిరసన తెలిపారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరని.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదించారు.

కాగా సాగు నీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ హాట్‌హాట్‌గా నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం నేతల భాషను నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఆ పార్టీ నేతలందరూ బయటకు వచ్చేశారు.

నిన్న నల్గొండ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారు అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్ నిన్న మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా? కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు మేం సిద్దం. రేపు సాయంత్రం వరకైనా సమయం ఇస్తున్నాం. కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొనాలి. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సభకి వచ్చి చర్చ చేయాలి. సచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌజ్‌లో దాకున్నారు. కేసీఆర్ నిన్న మాట్లాడింది ఏం భాష? ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకడానికి వెళ్ళాడు అని అంటారా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పాంటు లాగారు. ఇక జనం కేసీఆర్ చొక్కా కూడా లాగేస్తారు. సభకి రావాల్సిన నాయకుడు సభకి రాకుండా ముఖ్యమంత్రిని తిడతాడా?. మా ప్రభుత్వమే తప్పు చేసినట్టు గత ప్రభుత్వ మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అయ్యాయి’’ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు.

కాగా.. సభలో సీఎం రేవంత్ రెడ్డి భాషపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం తెలిపారు. సీఎంగా నిండు సభలో మాట్లడకూడని భాష మాట్లాడటం సబబు కాదన్నారు. సీఎం గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. సీఎం... రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను చీట్ చేసింది రాజగోపాల్ రెడ్డి అంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Feb 14 , 2024 | 01:59 PM

Advertising
Advertising