ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: నువ్వే అసలు దొంగ.. సీఎం రేవంత్‌పై హరీష్ కన్నెర్ర..!

ABN, Publish Date - Aug 29 , 2024 | 05:10 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ విషయంలో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి చీట్ చాట్‌లు అని.. అబద్దాల ప్రచారానికి చిట్‌ చాట్‌లను వాడుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీపై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే..

BRS MLA Harish Rao

హైదరాబాద్, ఆగష్టు 28: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ విషయంలో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి చీట్ చాట్‌లు అని.. అబద్దాల ప్రచారానికి చిట్‌ చాట్‌లను వాడుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీపై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు చెప్పారు. రుణమాఫీ చేయని గజ దొంగవి నువ్వు.. నన్ను దొంగ అంటావా? అని సీఎం రేవంత్‌పై ఘాటనై వ్యాఖ్యలు చేశారు హరీష్. రుణమాఫీ పాక్షికంగా జరిగిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు కదా అని గుర్తు చేశారు. వ్యవసాయ, రెవెన్యూ మంత్రులు కూడా రుణమాఫీ కాలేదని చెప్పిన విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు.


హరీష్ రావు కామెంట్స్ యధావిధిగా..

‘‘ఆగష్టు 15వ తేదీ లోపు వంద శాతం రుణమాఫీ చేస్తానని అన్నావ్.. చేశావా? ఓటుకు నోటులో రూ. 50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగవు నువ్వు. నన్ను దొంగ అంటావా? రాహుల్ గాంధీని కూడా రుణమాఫీ అయిందని చీట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేనే రిసీవ్ చేసుకుని కొండారెడ్డి పల్లె తీసుకువెళతా. రుణమాఫీ అయిందో లేదో అడుగుదాం. వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.’ అంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు.


కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు..

వాల్మీకి స్కామ్ పట్ట పగలు నిలువు దోపిడీ లాంటిదని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో 9 అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్పారు. దీనిపై ఈడీ రైడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సీఎం వస్తే ఇద్దరం వెళ్లి దర్యాప్తు చేయమని ఈడీని కోరతామన్నారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ భాయి భాయి అన్నట్లుగా ఉందన్నారు. అందుకే వాల్మీకీ స్కామ్‌పై తెలంగాణలో విచారణ జరగడం లేదన్నారు. వాల్మీకీ స్కామ్‌పై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ స్కామ్‌పై ఈడీని కలిసి విచారణ జరపాలని కోరతామని హరీష్ రావు చెప్పారు.


కూల్చివేతల సర్కార్..

తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ కూల్చివేతల సర్కారే అని హరీష్ రావు విమర్శించారు. ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కూల్చివేశారు. వైద్య వ్యవస్థను పూర్తిగా కూల్చేశారు. దేవుళ్ల మీద ఒట్టేసి ప్రజల విశ్వాసాన్ని కూల్చేశారు.’ అని ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. అంతెందుకు హైడ్రా ఆఫీసే హుస్సేన్ సాగర్ నాలా కింద ఉందని, రంగనాథ్ ముందుగా ఆయన ఆఫీస్ కూల్చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముందు రంగనాథ్ ఆఫీసును కల్చివేసి ప్రజల మీదకు రావాలన్నారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోం అన్నట్టు.. ముందు నీ ఆఫీస్, జీహెచ్ఎంసీ ఆఫీసు కూలగొట్టాలని అన్నారు. మీరాలం, ఉప్పల్, రామంతపూర్ చెరువుల్లో పెద్ద పెద్ద టవర్స్ వచ్చాయని.. అవి పట్టా భూములు వారికి పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


రేవంత్‌కు బీజేపీ బెయిల్ ఇప్పించిందా?

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి నీళ్లు ఎందులోకి వెళ్తున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. కమిషన్ కాకతీయ అని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని.. ప్రభుత్వం వారిదే కాబట్టి విచారణ జరిపించుకోవచ్చునని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజకు కనీసం మంత్రులు కూడా లేరని విమర్శించారు. తెలంగాణ తల్లి భావనకు రూపం ఇచ్చిందే కేసీఆర్ అని అన్నారు. ఆ క్రెడిట్ కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇదే సమయంలో కవితకు బెయిల్ అంశంపై సీఎం రేవంత్ స్పందించిన తీరును తప్పుపట్టారు. సీఎం స్థానంలో ఉండి న్యాయస్థానాల తీర్పుపై వక్ర భాష్యాలు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇప్పించిందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. తమకు సంస్కారం ఉందని.. రేవంత్‌లా నీచంగా తాము మాట్లాడలేమన్నారు. నీ సలహాదారు కేకే స్వాగతించారని.. నువ్వు మాత్రం వక్ర భాష్యాలు చెప్తావా? అంటూ సీఎం తీరుపై హరీష్ ఫైర్ అయ్యారు. ఈ పిచ్చి మాటల వల్లే ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.


ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర..

ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను బయటపెడతామన్నారు. కందుకూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 9లో 385 ఎకరాల భూమిని కాజేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అలాగే తుక్కుగూడ పరిధిలోని సర్వే నెంబర్ 895లో 25 ఎకరాల పేద రైతుల భూములు బినామీల పేరు మీదకు మారుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. ముచ్చర్లలో సీఎం తమ్ముళ్ల పీఏల పేర్ల మీద కూడా భూములు కొంటున్నారని అన్నారు.


మోదీ మెప్పు కోసమే..

సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి అరుణను గెలిపించారని హరీష్ రావు అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఎందుకు మెజారిటీ తగ్గిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి దగ్గరుండి బీజేపీకి ఓట్లు వేయించారని హరీష్ ఆరోపించారు. ముందు మహేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ తరువాత తమను అడగాలన్నారు.


Also Read:

రిలయన్స్ ఇన్వెస్టర్లకు ముకేశ్ అంబానీ బిగ్ గిఫ్ట్

వైభవంగా ‘లగ్గం’ టీజర్ విడుదల

ముకేశ్ అంబానీని దాటేసిన గౌతమ్ అదానీ.. ఆస్తి ఎంతకు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 29 , 2024 | 05:10 PM

Advertising
Advertising