ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: తీహార్ జైలులో కవితకు తీవ్ర అస్వస్థత

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:41 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..

న్యూ ఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం వరకూ కూడా ఆరోగ్యంగానే ఉన్న ఆమె ఒక్కసారిగా అనారోగ్యంగా ఉన్నట్లు తీహార్ జైలు సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం దీన్ దయాల్ ఆస్పత్రిలో కవితకు చికిత్స అందిస్తున్నారు. అయితే కవితకు ఏమైంది..? ఏ విషయంలో ఆస్పత్రికి తీసుకెళ్లారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మరో గంటలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆస్పత్రి సూపరిడెంట్.. వైద్య బృందం కలిసి మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.


ఆందోళన..!

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ నేతలను ఆస్పత్రికి పంపి.. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అగ్రనేతలు కోరారు. దీంతో గులాబీ నేతలు దీన్ దయాల్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇవాళ రాత్రికి బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. హెల్త్ బులెటిన్‌ను బట్టి ఢిల్లీకి వెళ్లాలా..? వద్దా..? అనేది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు.. టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, అభిమానులు కంగారుపడుతున్నారు. కవిత ఆరోగ్యంగా ఉండాలని కార్యకర్తలు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే.. ‘గెట్ వెల్ సూన్ అక్కా..’ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 06:29 PM

Advertising
Advertising
<