ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..

ABN, Publish Date - Dec 06 , 2024 | 08:31 AM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) అక్రమ అరెస్టులు (Illegal Arrests) చేస్తోందని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాం వద్ద బీఆర్ఎస్ నిరసన చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాం వద్దకు వెళ్ళే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ముందస్తు అరెస్టులు

బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యేలను ముందస్తు అరెస్ట్ చేసే అవకాశముంది. కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.


కాగా ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరుగ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. హరీష్‌రావు, కౌశిక్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని, అక్రమ కేసులు, అరెస్టులతో తమను బెదిరించాలనేచూస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, బీఆర్‌ఎస్‌ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఆందోళన విరమించారు.


ఇల్లందకుంట: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అరెస్టుకు నిరసనగా ఇల్లందకుంట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పోడేటి రామస్వామి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోల్నేని సత్యనారాయణరావు, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ కందాల కొంరెల్లి పాల్గొన్నారు.

వీణవంక: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు విజయ భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నీల కుమారస్వామి, మాజీ సింగిల్‌ విండో అద్యక్షుడు మాడ సాధవరెడ్డి, డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, స్వామి, మాజీ ఉప సర్పంచ్‌ భానుచందర్‌ పాల్గొన్నారు.

హుజూరాబాద్‌లో భారీ బందోబస్తు

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని హైద్రాబాద్‌లో గురువారం అరెస్టు చేయడంతో డివిజన్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఏసీపీ శ్రీనివాస్‌జీ ఆధ్వర్యంలో సీఐ తిరుమల్‌గౌడ్‌, సిబ్బంది బీఆర్‌ఎస్‌ నాయకులు రోడ్ల మీదకు రాకుండా చర్యలు చేపట్టారు. హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, బండ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖలో డీప్‌ టెక్నాలజీ సదస్సు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

ప్రముఖ హాస్యనటుడికి యాక్సిడెంట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 06 , 2024 | 08:31 AM