Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎంపై ఘాటు వ్యాఖ్యలు..
ABN, Publish Date - Nov 14 , 2024 | 09:32 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎవనిదిరా కుట్ర? అంటూ పరుష పదజాలంతో చెలరేగిపోయారు.
హైదరాబాద్, నవంబర్ 14: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎవనిదిరా కుట్ర? అంటూ పరుష పదజాలంతో చెలరేగిపోయారు. లగచర్ల ఘర్షణలో కేటీఆర్ కుట్ర ఉందంటూ పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న నేపథ్యంలో.. కేటీఆర్ స్పందిస్తారు. సీఎం రేవంత్ పాలనా తీరును తూర్పారబడుతూ.. సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా లగచర్ల వివాదంపై స్పందించారు కేటీఆర్. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టు సారాంశం యధావిధిగా కింద చూడొచ్చు..
‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? రూ. 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! జై తెలంగాణ.’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.
రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు...
లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందంటూ పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అధికారులపై దాడి కేసులో ఏ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఘటనకు ముందు, ఆ తరువాత కేటీఆర్‌తో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయ నిపుణుల సలహాతో కేటీఆర్ పేరును సైతం ఈ కేసులో చేర్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read:
మియాపూర్‌లో మిస్సింగ్.. పెద్దాపురంలో ప్రత్యక్షం
బ్యాగు లాక్కెళ్లే దొంగపై మనసు పడ్డ యువతి.. చివరకు..
10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంట్
For More Telangana News and Telugu News..
Updated Date - Nov 14 , 2024 | 09:32 AM