ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS - BSP: తెలంగాణలో కొత్త పొత్తు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Mar 05 , 2024 | 06:50 PM

BRS - BSP Alliance: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో(Telangana) కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్(BRS), బీఎస్‌పీ(BSP) మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు పొత్తు విషయమై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని కేసీఆర్ ప్రకటించారు.

BRS BSP Alliance

BRS - BSP Alliance: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో(Telangana) కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్(BRS), బీఎస్‌పీ(BSP) మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు పొత్తు విషయమై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని కేసీఆర్ ప్రకటించారు. సిద్ధాంత పరంగా కూడా రెండు పార్టీలు ఒకే రకంగా ఉన్నామన్నారు. దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధిష్టానం అనుమతి కూడా తీసుకున్నారని చెప్పారు. త్వరలోనే సీట్లు, విధివిధానాలను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతితో ఒకటి రెండు రోజుల్లో మాట్లాడుతానని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్, పెద్దపల్లి సహా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని, జనరల్ స్థానంలో కూడా పోటీ చేయొచ్చని తెలిపారు.

బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు బహుజనుల ఆకాంక్ష..

కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు బహుజన ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజ్యాంగం కాపాడబడాలనే పొత్తుకు పొత్తుకు బాటలు పడ్డాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో ఎక్కువ మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. జన్వాడలో మత ఘర్షణలు జరిగితే సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. లౌకిక వాదానికి కాంగ్రెస్‌కు అసలు సంబంధం లేదన్నారు. ఇక, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ప్రశ్నించగా.. గతంలో తాను బీఆర్ఎస్‌పై చేసిన కామెంట్స్ అలాగే ఉంటాయని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజనుల మీద ఎవరు దాడులు చేసినా అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటారని అన్నారు. తాను వ్యక్తుల మీద పోరాటం చేయలేదని, ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే తాను పోరాటం చేశానని అన్నారు. బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు, సీట్ల సర్దుబాటుపై మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

కేసీఆర్‌ను కలవడం సంతోషంగా ఉంది..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవడం సంతోషంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశంలో లౌకిక వాదం ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, లౌకిక వాదాన్ని కేసీఆర్ నిరంతరంగా కాపాడారని కొనియాడారు ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోందని విమర్శించారాయన. బీఆర్ఎస్-బీఎస్‌పీ కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. సీట్ల సర్దుబాబు అంశాన్ని అధిష్టానానికి నివేదిస్తామన్నారు. తెలంగాణలో ఈ స్నేహం ప్రజల జీవితాను బాగు చేస్తుందని ప్రవీణ్ కుమార్ అన్నారు. మూడు నెలలు కూడా కాలేదు.. నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని, రోడ్ల మీదకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2024 | 06:50 PM

Advertising
Advertising