ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CAG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వాస్తవాలు బయటపెట్టిన కాగ్

ABN, Publish Date - Feb 15 , 2024 | 11:33 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (TS Assembly Session) కాగ్ రిపోర్టును (CAG Report) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను కాగ్ రిపోర్ట్‌ పొందుపరిచింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా అంచనా వ్యయం రూ.1,06,000 కోట్లకు పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది.

రూ.87 వేల కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని, బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది. రుణాలు చెల్లింపులో కాలయాపన చేసిందని ప్రస్తావించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, రుణాల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వివరిందింది. కాళేశ్వరం అప్పు చెల్లించుకుంటూ పోతే 2036లో పూర్తవుతుందని కాగ్ నివేదిక అంచనా వేసింది.

పంచాయతీ రాజ్ శాఖపై...

పంచాయతీ రాజ్ శాఖపై కాగ్ రిపోర్టు ఈ విధంగా ఉంది... ‘‘గ్రాంట్ల మళ్ళింపు జరిగింది. నిధుల దుర్వినియోగం జరిగింది. బకాయిలు వసూలు చేయలేకపోయారు. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు. సకాలంలో రికార్డులు సమర్పించలేదు’’ అంటూ కాగ్ రిపోర్టులో వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 15 , 2024 | 12:37 PM

Advertising
Advertising