ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్‌ రద్దు చేయండి

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:05 AM

రైతులు కష్టపడి పండించే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు...

కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిపేసి బ్లాక్‌ లిస్టులో పెట్టండి

ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే ఉపేక్షించొద్దు

నీటి సరఫరాకు ఆటంకం కలిగించే వారిపై వేటు వేయండి.. సమీక్షలో సీఎం

కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యత ఐఏఎస్‌లకు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్టపడి పండించే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్‌ లైసెన్సులు రద్దు చేయాలని, కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిపివేసి బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం సమీక్ష జరిపారు. తేమ ఎక్కువగా ఉందంటూ కొన్ని చోట్ల వ్యాపారులు, మిల్లర్లు ధాన్యం ధరకు కోత పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. కాబట్టి ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఒకటి రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సీఎం సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్‌ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా, కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని.. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాల అధికారులు జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. తాగునీటి సరఫరా నిమిత్తం ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని సీఎం పేర్కొన్నారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల సమయం కావడంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశపూర్వక కథనాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారని.. కాబట్టి తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చిన చోట యుద్ధప్రాతిపదికన నీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. ఏరోజుకారోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో మిషన్‌ భగీరథ, మునిసిపల్‌, ఇరిగేషన్‌, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సూచించారు. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా చూడాలని, మరింత డిమాండ్‌ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు. ఇటు సింగూర్‌ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు.

ఉద్యోగం నుంచి తీసేయండి..

హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఈ సందర్భంగా సీఎం దృష్టికి వచ్చింది. దీంతో.. ఉద్దేశపూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కావాలని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated Date - Apr 13 , 2024 | 03:05 AM

Advertising
Advertising