ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

ABN, Publish Date - Aug 26 , 2024 | 12:43 PM

Telangana: సీఎంఆర్ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌బాద్‌లో ఉన్న హాస్పటల్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఆస్పత్రులు ఫేక్ బిల్లులు పెట్టి క్లైమ్ చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. వెరిఫికేషన్‌లో హాస్పిటళ్ల బాగోతం బట్టబయలైంది.

CMRF Scam

హైదరాబాద్, ఆగస్టు 26: సీఎంఆర్ఎఫ్ స్కాంలో (CMRF Scam) 17 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌బాద్‌లో ఉన్న హాస్పటల్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఆస్పత్రులు ఫేక్ బిల్లులు పెట్టి క్లైమ్ చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. వెరిఫికేషన్‌లో హాస్పిటళ్ల బాగోతం బట్టబయలైంది. గతంలో ఇదే స్కాంలో నలుగురిని సీపీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విషయం తెలిసిందే. రెండు హాస్పిటల్స్ నుంచి 6 లక్షల ఫేక్ బిల్లులను ఆస్పత్రుల నిర్వాహకులు క్లైమ్ చేసుకున్నారు. వీరిపై ఫోర్జరీతో పాటు చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి.

HYDRAA: దడ పుట్టిస్తున్న హైడ్రా నాన్‌స్టాప్ కూల్చివేతలు..


రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ కుంభోణం తీవ్ర సంచలనం రేపుతోంది. రోగులకు ట్రీట్మెంట్ అందింకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ నిధులను డ్రా చేసుకున్న పలు ఆస్పత్రులు బాగోతాన్ని సీఐడీ గుర్తించింది. రోగులు లేకుండా, వైద్యం చేయకుండా.. కేవలం కాగితాల్లోనే పెద్ద జబ్బులున్నట్లు పేర్కొంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను డ్రా చేస్తున్నారంటూ గత ఏడాది రెవెన్యూ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం బయటపడింది. ఈ స్కామ్‌లో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు. మొత్తం 17 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది.


ఈ వార్త కూడా చదవండి...

HYDRAA: దడ పుట్టిస్తున్న హైడ్రా నాన్‌స్టాప్ కూల్చివేతలు..

హైదరాబాద్ నగరంలో హైడ్రా(HYDRAA) కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.


తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది.


ఇవి కూడా చదవండి

Krishnashtami Whishes: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కేసీఆర్

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 12:55 PM

Advertising
Advertising
<