Congress: ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు..
ABN, Publish Date - Nov 14 , 2024 | 07:54 AM
నవంబర్ 14 నుంచి (బుధవారం) డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్‌బి స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 26 రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు జరుగుతాయి.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.,) ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది కాలం పూర్తి అవుతుంది. నవంబర్ 14 నుంచి (బుధవారం) డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు (Public, Governance Celebrations) ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్‌బి స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. 26 రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు జరుగుతాయి. నెహ్రూ జయంతి (Nehru Jayanti) రోజు వేడుకలు ప్రారంభమై.. సోనియా గాంధీ (Sonia Gandhi) పుట్టిన రోజు నాడు ముగింపు వేడుకలు జరుగుతాయి.
మొదటిరోజు విద్యా విజయోత్సవాలు.. బాలల దినోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. గురుకులాలు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ చార్జీలు పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించిన నేపథ్యంలో ఫస్ట్ డే విద్యా విజయోత్సవాలు నిర్వహిస్తారు. ఎల్‌బి స్టేడియంలో 14 వేల మంది విద్యార్థులతో విద్యా విజయోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా 26 రోజులు వేడుకలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా కీలక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకలు ఘనంగా జరుగుతాయి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. బహిరంగ సభతో వేడుకలు ముగిస్తాయి. ముగింపు వేడుకలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానిస్తున్నారు.
కాగా గాంధీ భవన్లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో నెహ్రు చిత్రపటానికి నివాళులు అర్పించినున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారు. అలాగే ఉదయం 10 గంటలకు అబిడ్స్‌లోని నెహ్రు విగ్రహానికి కాంగ్రెస్ నేతలు, మంత్రులు నివాళులర్పించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ..
లగచర్ల దాడిలో.. కేటీఆర్ ప్రమేయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 14 , 2024 | 07:54 AM