TS Highcourt: ‘జడ్జి గారు మా మొర వినండి’.. హైకోర్టుకు చిన్నారుల లేఖ
ABN, Publish Date - Feb 21 , 2024 | 11:48 AM
Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాశారు. మొత్తం 23 మంది చిన్నారు ఈ లేఖ రాశారు. చిన్నారుల లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు (Chief Justice of Telangana High Court) చిన్నారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాశారు. మొత్తం 23 మంది చిన్నారులు ఈ లేఖ రాశారు. చిన్నారుల లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు (Telangana HighCourt) స్వీకరించింది. ఆదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది. స్థానికంగా ఉన్న చిన్నారులు ఆడుకునేందుకు ఈ పార్క్‌కు వస్తుంటారు. అయితే పార్క్‌లో ఉన్న కొంత స్థలాన్ని కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నం చేస్తున్నారని చిన్నారులు లేఖలో పేర్కొన్నారు. కబ్జా పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్‌కు పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 7కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 21 , 2024 | 11:51 AM