CM Revanth: భారీ వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమావేశం
ABN, Publish Date - Sep 02 , 2024 | 11:28 AM
Telangana: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కామాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా... మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కామాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా... మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
CM Chandrababu: ఫలించిన చంద్రబాబు ప్రయత్నం.. విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం.. వరద సహాయక చర్యల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాల్లో వర్ష పాతం నమోదు అయిన విషయం తెలిసిందే. వర్షాలకు పలు నదులు, వాగులు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పది మంది మృతువాత పడ్డారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ఎప్పటికప్పుడు సీఎం మానిటరింగ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల వల్ల నీట మునిగిన పంట పొలాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. జిల్లాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కోసం సచివాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 040 - 23454088 ఏర్పాటు చేశారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయి వరద..
ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడింది: భట్టి
భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ఈ విపత్కర పరిస్దితిలో యావత్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడిందన్నారు. ప్రతి ఒక్క కుటంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలబడతామన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రతిపక్షం తన భాద్యత మరచి అర్దం లేని ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతల ట్విట్టర్, ఎక్స్ కూతలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. తమకు ప్రజలు ముఖ్యమని.. వారి ప్రాణాలు ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని.. ప్రజలు అధైర్యపడవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Seethakka: భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష
Hydra: హైడ్రా కూల్చివేతలకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 02 , 2024 | 01:04 PM