ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth : డీఎస్ అంత్యక్రియలకు సీఎం రేవంత్

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:45 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్(D Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

CM Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పార్ధీవదేహంపై పార్టీ కండువా, జెండా కప్పి కాంగ్రెస్ నేతలు గౌరవించారు. డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా కప్పగానే డీఎస్ చివరి కోరిక తీరిందని ఆయన స్నేహితులు చెబుతున్నారు.


కాగా.. డీఎస్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. రేపు (ఆదివారం) నిజామాబాద్‌లో డీ శ్రీనివాస్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డులోని సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు డీఎస్‌ పెద్ద కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ తెలిపారు.అయితే రేపు డీఎస్ అంత్యక్రియల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. రేపు నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Jun 29 , 2024 | 04:47 PM

Advertising
Advertising