ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్

ABN, Publish Date - Oct 21 , 2024 | 10:56 AM

Telangana: అమరులైన పోలీస్ అధికారులందరికీ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కారణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంవైపు నడవాలంటే పోలీసులు కీలకమన్నారు.

CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబర్ 21: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ప్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విధి నిర్వహణలో అసువులుబాసి అమరులైన పోలీసులకు సీఎం నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగిస్తూ.. అమరులైన పోలీస్ అధికారులందరికీ ప్రభుత్వం తరపున ఘన నివాళులర్పించారు. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కారణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంవైపు నడవాలంటే పోలీసులు కీలకమన్నారు. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని.. రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.

YS Jagan: భయపడ్డారా.. కాంగ్రెస్‌తో దోస్తీ కోసమేనా రాజీ..


ఇది అందరికీ స్ఫూర్తిదాయకం..

అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. తీవ్రవాదులు, మావోయిస్టు చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. డ్రగ్స్ మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పంజాబ్ రాష్టంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు టీజీఎన్‌ఏబీను ఏర్పాటు చేశామన్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు.


కఠిన చర్యలు తప్పవు...

మందిరాల మీద, మజీద్‌ల మీద దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని తెలిపారు. వివిధ పండుగలు ప్రశాంతంగా జరుకోవడంలో పోలీస్ సేవలు మరచిపోలేమని కొనియాడారు. జీతం కోసం పోలీస్ సిబ్బంది పనిచేయడం లేదని.. బాధ్యతాయుతంగా భావించి పోలీసులు సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డీజీపీ డాక్టర్ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM Chandrababu: తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే.. తాట తీయండి.. చంద్రబాబు ఆదేశాలు


ఇకపై కోటి నష్టపరిహారం

క్రిమినల్స్‌తో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండడం కాదని.. బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. క్రిమినల్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీస్ కుటుంబాల కోసం యంగ్ ఇండియా స్కూల్‌ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. ఈరోజు పునాది వేస్తున్నామన్నారు. వచ్చే అకాడమీ నుంచి విద్యా సంస్థ ప్రారంభిస్తామని చెప్పారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహారించాలని స్పష్టం చేశారు. ‘‘పోలీస్ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తాను’’ అని తెలిపారు. వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇక నుంచి కోటి రూపాయలు నష్ట పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌కు కోటి రూపాయలు, సబ్ ఇన్‌స్పెక్టర్‌, ఇన్‌స్పెక్టర్‌లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు ఇస్తామని.. అలాగే శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు కూడా నష్ట పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇంతే కాకుండా చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


ఎక్కడా రాజీ లేదు: డీజీపీ జితేందర్

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అని డీజీపీ జితేందర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 214 మంది పోలీసులు అమరులు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రవీణ్ అనే కానిస్టేబుల్ అమరుడు అయ్యారని.. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీపడడం లేదని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు.. వాటికి కావాల్సిన సౌకర్యాలు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందు వరుసలో ఉందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 11:44 AM