CM Revanth: లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ సీరియస్
ABN, Publish Date - Sep 13 , 2024 | 09:28 AM
Telangana: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Serilingampally MLA Arekapudi Gandhi), బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy) మధ్య జరిగిన మాటల యుద్ధం ఏ రేంజ్‌లో ఉత్కంఠ రేపిందో అందరికీ తెలిసిందే. గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునివ్వడం మరింత కలకలం రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు.
Balineni Srinivasa Reddy : జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు
ఈరోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై సీఎం పూర్తి రివ్యూ చేయనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ జరిగింది...
కాగా గత రెండు రోజులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తానని కౌశిక్ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో గురువారం దాదాపు గంటన్నరపాటు అక్కడి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.
కౌశిక్‌పై కేసు..
తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేవారు. 132, 351 (3) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 13 , 2024 | 09:42 AM