CM Revanth: ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ.. టీపీసీసీ ఎవరో మరి?

ABN, Publish Date - Aug 23 , 2024 | 03:18 PM

Telangana: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.

CM Revanth: ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ.. టీపీసీసీ ఎవరో మరి?
CM Revanth Reddy

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నూతన పీసీసీ ఎంపిక, క్యాబినెట్ విస్తరణ, వరంగల్లో సభ నిర్వహించే అంశాలపై రాహుల్ గాంధీతో నేతల చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

KTR: సీఎం ఉండాల్సింది ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీలో


ఎస్సీ ,ఎస్టీ ,బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకరికి పీసీసీ పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే క్యాబినెట్ విస్తరణలో పలు సామాజిక వర్గాలను తీసుకునే అంశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే వరంగలలో సభ పెట్టే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సభకు రాహుల్ గాంధీ రావాలని నేతలు కోరనున్నారు.


కాగా.. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్.. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కీ పీసీసీ చీఫ్ రేసులోకి వచ్చారు. మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి. దాదాపుగా నేడు అధిష్టానం ఖరారు చేస్తుందని అంతా భావిస్తున్నారు.

Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్



అలాగే కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చిస్తున్న నేపథ్యంలో... తాజాగా మంత్రి మండలిలోకి మరో నలుగురిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్‌, సుదర్శన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్‌, రామచంద్రనాయక్‌ తదితరులున్నారు.


ఇవి కూడా చదవండి...

Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!

Nimmala Ramanaidu: వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం


Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 03:21 PM

Advertising
Advertising
<