TS NEWS: మార్చి 8న ఓల్డ్ సిటీ మెట్రోకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ABN, Publish Date - Mar 04 , 2024 | 09:29 PM
మార్చి 8వ తేదీన ఓల్డ్ సిటీ మెట్రోకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్(MGBS) నుంచి ఫలక్‌నుమా వరకు ఓల్డ్ సిటీ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. 5.5 కిలో మీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో పనులను చేపట్టింది.
హైదరాబాద్: మార్చి 8వ తేదీన ఓల్డ్ సిటీ మెట్రోకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్(MGBS) నుంచి ఫలక్‌నుమా వరకు ఓల్డ్ సిటీ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. 5.5 కిలో మీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో పనులను చేపట్టింది. ఈ దారిలో 5 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషిర్ గంజ్, ఫలక్ నుమా మెట్రో స్టేషన్లు ఈ ప్లాన్‌లో ఉండనున్నాయి. 5.5 కిలో మీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో 103 మత పరమైన నిర్మాణాలు ఉన్నాయి. మత పరమైన నిర్మాణాలను తొలగించకుండా ఓల్డ్ సిటీ మెట్రో ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొదించింది.
ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేసి మెట్రో పనులను అధికారులు ప్రారంభించనున్నారు. రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో 69.2 కిలో మీటర్లలో మెట్రోరైలు అందుబాటులో ఉంది. ఎల్బీనగర్ - మియాపూర్, నాగోల్ - రాయదుర్గం, జేబీఎస్ - ఎంజీబీఎస్ రూట్లలో ప్రతి రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లోనూ పాతనగరం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు టూరిజం మరింత అభివృద్ధి చెందనున్నది.
Updated Date - Mar 04 , 2024 | 09:29 PM