ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..

ABN, Publish Date - Jul 16 , 2024 | 11:22 AM

Telangana: సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని... ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy

హైదరాబాద్, జూలై 16: సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ... డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని... ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

Ram Prasadreddy: అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం..


మీ సొంత రాష్ట్రంగా భావించండి..

‘‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి.. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే’’ అని సీఎం స్పష్టం చేశారు.

Raj Tarun: హీరో రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోలీసులు


ఆ బాధ్యత కలెక్టర్లదే...

ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమన్నారు. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారని... అలాగే కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని తెలిపారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

Balineni Srinivas: త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా.. బాలినేనిశ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 11:32 AM

Advertising
Advertising
<