ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:25 PM

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్(Health Tourism Hub) ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్నీ రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్(Health Tourism Hub) ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్నీ రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో బసవతారకం ఆస్పత్రికి కచ్చితంగా చోటు ఉంటుందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.." ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషకరం. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన ఆలోచనా విధానాలు కొనసాగించాలని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అప్పట్లో దీని నిర్మాణం పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా తీర్చిదిద్దారు. వైద్య సేవలు అందుతున్న తీరు చూసి ఎన్టీఆర్ స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ ఆస్పత్రి 25వ వార్షికోత్సవానికి రావాలని కోరుతున్నారు. 30వ వార్షికోత్సవానికి కూడా నేనే ముఖ్యమంత్రి హోదాలో వస్తా. ఆస్పత్రి లీజ్ వివాదాన్ని క్యాబినేట్ నిర్ణయం తీసుకుని పరిష్కరించాం" అని అన్నారు.


అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గతంలో 12గంటలు పని చేస్తే చాలు అనుకునే వాడినని కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18గంటలు పని చేసే వ్యక్తి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం వచ్చిందని.. ఒక ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలని అన్నారు. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రి కావడంతో తనతో సహా అధికారులంతా 18గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

For more Telangana news and Latest news click here..

Updated Date - Jun 22 , 2024 | 03:25 PM

Advertising
Advertising