ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు... రోడ్డుపై భైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:10 PM

అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ లాబీల నుంచి మీడియా పాయింట్ వరకూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అదానీ, రేవంత్ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు.

CM Revanth Reddy Protest

హైదరాబాద్: కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నిరసనలతో తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. పోటాపోటీ నిరసనలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు సహా కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ (బుధవారం) పెద్దఎత్తున నిరసన చేపట్టారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీ చేపట్టి రాజ్ భవన్‌ (Raj Bhavan)కు వెళ్లారు. అదానీ లంచం వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవటం, మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.


కేసీఆర్ స్టాండ్ ఏంటి?

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తన నిరసన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై భైఠాయించారు. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ అంటూ నినాదాలు చేశారు. అలాగే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు సీఎం. అదానీ, మణిపూర్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేయాలని సీఎం కోరారు. అలాగే అదానీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్టాండ్ ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.


ఇద్దరూ భాయ్ భాయ్..

మరోవైపు అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ లాబీల నుంచి మీడియా పాయింట్ వరకూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అదానీ, రేవంత్ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆగ్రహించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే రోడ్లపై సీఎం రేవంత్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. అదానీతో రేవంత్ రెడ్డిది ఢిల్లీలో దోస్తీ..‌ గల్లీలో కుస్తీ అని ఎద్దేవా చేశారు. అదానీకి ఏజెంట్ మాదిరి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు హరీశ్ రావు. రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై భైఠాయించి ట్రాఫిక్ జామ్ చేసిన ముఖ్యమంత్రిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.


బంధం బయటపెడతాం..

అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాజ్ భవన్ వద్ద రేవంత్ మాట్లాడింది నిజమే అయితే రాష్ట్ర పరువును ఆయన మంట కలిపినట్లేనని అన్నారు. అదానీపై మాట్లాడే ధైర్యం లేకనే కేసీఆర్, కేటీఆర్ గురించి రేవంత్ మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ హైకమాండ్ తిట్టినందుకే అదానీ రూ.100 కోట్లను రేవంత్ రెడ్డి వాపస్ ఇచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. అదానీపై కాంగ్రెస్‌పై పోరాటం నిజమైతే రూ.12.400 కోట్ల ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు పహారా మధ్య రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రాహుల్ గాంధీని సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా అదానీ, రేవంత్ బంధం బయటపెడతామని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో.. రేవంత్ రెడ్డి మాటల్లో నిజం కూడా అంతేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.


ఇవి కూడా చదవండి...

వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ

TG Assembly: అసెంబ్లీలో భూభారతి 2024 బిల్లు.. ప్రతిపక్షాల అభ్యంతరం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 03:20 PM