ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీతో కాసేపట్లో భేటీ..!

ABN, Publish Date - Jan 12 , 2024 | 06:23 PM

సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం నాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీని ( Sonia Gandhi ) ఆమె నివాసంలో కలవనున్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ, ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని అడగనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. రేపు( శనివారం ) పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఉదయం మణిపూర్‌కి వెళ్లనున్నారు. ఈనెల 14వ తేదీన ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేపట్టే భారత్ న్యాయ యాత్రలో పాల్గొనడానికి మణిపూర్ వెళ్లనున్నారు. న్యాయ యాత్రలో పాల్గొన్న అనంతరం అదే రోజు ఢిల్లీకి చేరుకొని దావోస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.

Updated Date - Jan 12 , 2024 | 06:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising