ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఇందిరా గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Oct 30 , 2024 | 07:40 PM

అక్టోబర్ 31(గురువారం)న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తన ప్రతి రక్తపు బొట్టు దేశ పటిష్టతకు తోడ్పతుందని చెప్పిన మ‌హ‌నీయురాలు ఇందిరా గాంధీ అని రేవంత్ కొనియాడారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గత పదేళ్ల విధ్వంసపు పాలన చీకట్లు తొలగిపోయాయని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోందని సీఎం చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ, సంతోషాలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా చిన్నా, పెద్ద అందరూ పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


అదే విధంగా అక్టోబర్ 31(గురువారం)న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తన ప్రతి రక్తపు బొట్టు దేశ పటిష్టతకు తోడ్పతుందని చెప్పిన మ‌హ‌నీయురాలు ఇందిరా గాంధీ అని రేవంత్ కొనియాడారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని తెలిసినప్పటికీ దేశ స‌మ‌గ్రత, స‌మైక‌త్య, పటిష్టత కోసం ఆమె కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగారని ముఖ్యమంత్రి చెప్పారు. రాజ‌భ‌ర‌ణాల ర‌ద్దు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేద‌ల అభ్యున్నతికి ఆమె ఎంత‌గానో కృషి చేశార‌ని అన్నారు. తెలంగాణ‌లోని ప్రజా ప్రభుత్వం ఇందిర‌మ్మ పాల‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుంద‌ని ఆయన చెప్పారు. ఆ మ‌హ‌నీయురాలి స్ఫూర్తితో పేద‌ల అభ్యున్నతే ల‌క్ష్యంగా "ఇందిర‌మ్మ ఇళ్లు" కార్యక్రమం చేప‌డుతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా భార‌త‌దేశ సార్వభౌమత్వానికి నిండుద‌నం చేకూర్చిన మ‌హ‌నీయుడు స‌ర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను రేవంత్ రెడ్డి కొనియాడారు. భార‌తదేశ ప్రథమ ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఆయ‌న చూపిన చొర‌వ‌, సమర్థత వల్లే వంద‌లాది సంస్థానాలు దేశంలో విలీన‌ం అయ్యాయ‌ని ముఖ్యమంత్రి అన్నారు. స‌ర్దార్ ప‌టేల్ ఆశ‌య సాధ‌న‌కు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Group-3 Schedule: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే..

Save Life: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..

Updated Date - Oct 30 , 2024 | 07:40 PM