Congress: కొడంగల్ ఇష్యూ.. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 03:33 PM
Telangana: కొడంగల్‌లో భూసేకరణపై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారని.. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారని.. దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంపీ మల్లు రవి తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 12: ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని పథకం ప్రకారం బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో భూసేకరణపై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారని.. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారని.. దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చూపించాలనే డ్రామాలో భాగంగానే కొడంగల్ ఘటన చేశారని ఆరోపించారు. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు నిమిషానిమిషానికి ఫోన్లు చేసి, మందు సేవించి కలెక్టర్‌పై దాడి చేశారన్నారు.
CM Chandrababu: ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
ఇది సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అని తెలిపారు. కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడు హింస మార్గంలో పోరాటం చేయలేదని.. అహింస మార్గంలోనే తాము కేసీఆర్ పై పోరాడామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కుటుంబ సభ్యుల మేలు కోసమే కేసీఆర్ పదేళ్లు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. దాడి చేయించి, కేటీఆర్ ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో అంతకుముందే ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా గతంలో బీజేపీ సహకరించిన విషయాలను గుర్తుచేసి అమృత్ భారత్ స్కాం అంటూ పిర్యాదు చేయడానికి వచ్చారని అన్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి.. రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఏ ప్రాజెక్టు పనులైన టెండర్లు పిలిచే పనులు అప్పగిస్తారని.. ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ అమృత్ భారత్ పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్తున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకు పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా శత్రువులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అడ్డుకునేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్‌ఎస్ పార్టీ అని విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కలెక్టర్లను, ఎస్పీలను, ప్రభుత్వ ఉద్యోగులను కూలీవారిలా ట్రీట్ చేశారని.. తాము అధికారుల్లాగా ట్రీట్ చేస్తున్నామన్నారు. మధుసూదనాచారి, బీఆర్‌ఎస్ నేతలు దాడికి గురైన వాళ్ళను చూడకుండా, దాడిని చేసిన వారిని చూడటానికి వెళ్తున్నారంటేనే ఆ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం అవుతోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు బయటపెట్టాలని.. అంతేకాని ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడంసరికాదన్నారు. ప్రజలే బీఆర్‌ఎస్ నేతలకు సరైన గుణపాఠం చెప్తారన్నారు. నిర్మాణాత్మక సూచనలు చేయకుండా దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. కొడంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తానే లేఖ రాస్తానని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Attack on Collector: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 12 , 2024 | 03:33 PM