ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CP Avinash Mahanthi: డ్రగ్ టెస్ట్ చేస్తే ఆ ముగ్గురికీ పాజిటివ్

ABN, Publish Date - Feb 26 , 2024 | 01:09 PM

నేడు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌పై పోలీసులు జరిపిన దాడిపై సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. రాడిసన్ బ్ల్యూ హోటల్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో దాడి చేశామని సీపీ తెలిపారు. హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ చేశామన్నారు. అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారు అయ్యారన్నారు.

హైదరాబాద్: గచ్చిబౌలి (Gachibowli)లోని రాడిసన్ హోటల్‌పై నేడు పోలీసులు జరిపిన దాడిపై సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mahanthi) వివరాలను వెల్లడించారు. రాడిసన్ బ్ల్యూ హోటల్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో దాడి చేశామని సీపీ తెలిపారు. హోటల్‌లో డ్రగ్స్ (Drugs) పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ చేశామన్నారు. అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారు అయ్యారన్నారు. కొంత సమాచారంతో రాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్ళామన్నారు. వివేకానంద మంజీర గ్రూప్‌కి డైరెక్టర్‌గా ఉన్నాడని సీపీ వెల్లడించారు.

ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని తెలిపారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశామని అవినాష్ మహంతి వెల్లడించారు. వివేకానందతో పాటు నిర్భయ్ , కేదార్‌కు పాజిటివ్ వచ్చిందన్నారు. వివేకానందకు యూరిన్ టెస్ట్ చేయించగా కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. మొత్తం ఈ పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. రాడిసన్ హోటల్‌లో గతంలోనూ పార్టీలు జరిగినట్లు గుర్తించామన్నారు. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి వీరందరికీ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. వివేకానంద, నిర్భయ్, కేదార్‌పై 121b 27, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా తాము అటాచ్ చేస్తున్నామని సీపీ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 01:09 PM

Advertising
Advertising