ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: వాహనదారులకు ముఖ్య గమనిక.. ఇక ముక్కుపిండి వసూలు చేయడమే..!

ABN, Publish Date - Feb 17 , 2024 | 06:43 PM

తెలంగాణలో ప్రభుత్వం మారాక రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. భాగ్యనగరంలో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ నిబంధనలు మార్చడానికి కూడా వెనకాడొద్దని సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగిపోయారు..

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం మారాక రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. భాగ్యనగరంలో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ నిబంధనలు మార్చడానికి కూడా వెనకాడొద్దని సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగిపోయారు.

వసూల్.. వసూల్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై భాగ్యనగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ( Kothakota Srinivas Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం నాడు సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి నిరంతర ట్రాఫిక్ నియంత్రణ చర్యలను తీసుకుంటామని తెలిపారు. పార్కింగ్ ఆక్రమణలు, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ ఫాలో అవ్వకపోతే చలాన్ వేసి ముక్కుపిండి వసూలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. గూడ్స్ వాహనాలతో ట్రాఫిక్ పెరిగి పోతుందని.. వాటికి కేటాయించిన సమయంలో మాత్రమే నగరం లోపలకు రావాలని సూచించారు. మిగతా సమయంలో వస్తే చలాన్లను వేస్తామనిహెచ్చరించారు. ట్రాఫిక్‌పై కొత్త రెగ్యూలేషన్స్ తేబోతున్నామని.. ట్రాఫిక్ లెస్ సిటీగా హైదరాబాద్ మారనుందని తెలిపారు. ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

అవగాహన కల్పిస్తాం..

అర్బన్ ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన ఇస్తున్నామని తెలిపారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 150 కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు 35వేల మంది హాజరయ్యారని తెలిపారు. ఇంటి నుంచి బయటకొస్తే సేఫ్‌గా మళ్లీ వెళ్లాలని అన్నారు. వాహనాలను ఓవర్ రాష్ డ్రైవింగ్ చేసి ఇంట్లోవారికి శోకం మిగల్చవద్దని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ హైదరాబాద్ నగరం పేరు కాపాడుదామని అన్నారు. ట్రాఫిక్ అనేది జీవనది అని పోలీసులు నిరంతరం కష్టపడుతునే ఉంటారని చెప్పారు. ఒక్కరి తప్పుతో ట్రాఫిక్ వల్ల అందరం ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. హైదరాబాద్ రోడ్లపై సాఫీగా వాహనాలు ముందుకెళ్లాలని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 17 , 2024 | 11:06 PM

Advertising
Advertising