ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అడుగుకో మందుపాతర!

ABN, Publish Date - Jun 12 , 2024 | 05:31 AM

మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్‌గా పోలీసులే లక్ష్యంగా బూబీట్రాప్స్‌, మందుపాతరలతో నక్సల్స్‌ ప్రతివ్యూహాలతో ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దు ఏజెన్సీల పౌరులు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఏసు అనే స్థానికుడు బలవ్వడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు విలవిల్లాడుతున్నారు.

అడుగడుగునా బూబీ ట్రాప్‌లు.. తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల చక్ర వ్యూహం

  • స్థానికులు, వన్యప్రాణులకు ముప్పు

  • భద్రత బలగాలే లక్ష్యంగా స్కెచ్‌

  • కర్రెగట్టల నుంచి కొంగాల దాకా గుర్తింపు

  • వందల సంఖ్యలో బాంబుల నిర్వీర్యం

  • 70 బూబీట్రా్‌పల తొలగింపు

  • ‘ఆపరేషన్‌ జలశక్తి’కి పెను సవాల్‌

ములుగు, చర్ల, జూన్‌ 11: మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్‌గా పోలీసులే లక్ష్యంగా బూబీట్రాప్స్‌, మందుపాతరలతో నక్సల్స్‌ ప్రతివ్యూహాలతో ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దు ఏజెన్సీల పౌరులు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఏసు అనే స్థానికుడు బలవ్వడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మందుపాతరలను, బూబీ ట్రాప్‌లను గుర్తించడంతో ఏజెన్సీల్లోని పల్లెల్లో కలకలం చెలరేగుతోంది.

  • పోలీసులే టార్గెట్‌గా వ్యూహాలు..!

ప్రస్తుతం మావోయిస్టులకు ఛత్తీ్‌సగఢ్‌ కంచుకోటగా ఉన్నా.. గడిచిన ఆర్నెల్లలో జరిగిన 11 ఎన్‌కౌంటర్లలో 119 మంది మావోయిస్టులు దుర్మరణంపాలయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెట్టకూడదనే లక్ష్యంతో గ్రేహౌండ్స్‌ బలగాలు రేయింబవళ్లు సరిహద్దుల్లో పహారాకాస్తున్నాయి. చర్ల అడవులతోపాటు.. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాలు-- కర్రెగుట్ట, కొంగాల అభయారణ్యాలు ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులుగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గాన్ని మినహాయిస్తే.. బలగాలు నక్సల్స్‌ స్థావరాలను చేరాలంటే.. దట్టమైన ఈ అరణ్యాలను దాటి వెళ్లాలి. ఈ మార్గాల్లో వచ్చే పోలీసులను టార్గెట్‌గా చేసుకుంటూ..

మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మందుపాతరలను అమర్చారు. గుట్టలను ఎక్కి-దిగే చోట బూబీ ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. కాలి అడుగు పడితే.. కొద్దిపాటి ఒత్తిడికే భారీ విస్పోటనం చెందేలా వందలు.. వేల సంఖ్యలో బాంబులను అమర్చినట్లు తెలుస్తోంది. బూబీ ట్రాప్‌లో పడితే.. వారి పరిస్థితి ప్రత్యక్ష నరకమే..! ఒకవేళ ప్రాణాలతో బతికినా.. ఒంట్లోకి గుచ్చుకుపోయిన పదునైన కర్రలు, పదునైన రాడ్లను తొలగించేప్పుడు ఎంతటివారైనా విలవిల్లాడాల్సిందే. బలగాల వెంట బాంబ్‌ డిస్పోజబుల్‌, డాగ్‌ స్క్వాడ్‌లు ఉన్నా.. ఏమాత్రం ఆదమరిచినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టమవుతోంది. డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టినా.. వారిని చేరేందుకు మందుపాతరలు, బాంబులు, బూబీట్రా్‌ప్సతో కూడిన చక్రవ్యూహాలను దాటుకుని వెళ్లడం కత్తిమీద సాములాంటిదే..!

వేసవిలో ఆకురాలే కాలాన్ని అనుకూలంగా మలచుకున్న బలగాలు.. 11 భారీ ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను కోలుకోలేకుండా దెబ్బతీశాయి. ఇప్పుడు వర్షాలు ప్రారంభం కావడంతో ‘ఆపరేషన్‌ జలశక్తి’ పేరిట కూంబింగ్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో.. తాజాగా ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని బీమారంపాడు అడవుల్లో భద్రతాబలగాలు 70 బూబీట్రా్‌ప్సను గుర్తించాయి. వాటిలోంచి 4,396 పదునైన కర్రలను వెలికితీశాయి.

చర్ల సీఐ రాజువర్మ నేతృత్వంలో బూబీట్రా్‌పల గుర్తింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ 2021, 2022 సంవత్సరాల్లో ములుగు జిల్లా పోలీసులు నాలుగు భారీ మందుపాతరలు, పేలుడు సామగ్రిని సీజ్‌ చేశారు. ఆ తర్వాత అప్పటి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ నేతృత్వంలో జరిపిన తనిఖీల్లో అడవుల్లో పెద్ద ఎత్తున బూబీట్రాప్స్‌, బాణాలు, ఈటెలు, కార్డెక్స్‌ వైర్లు, ప్రెషర్‌కుక్కర్లు, బకెట్‌ బాంబులు, జెలిటెన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, ఐఈడీలను పేల్చేందుకు ట్రిగ్గర్లుగా వాడుతున్న కారు డిజిటల్‌ కీచైన్లు, ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లను సీజ్‌ చేశారు.


బలవుతున్న అమాయకులు..

  • 2003లో తొలిసారిగా మావోయిస్టుల చర్యతో సామాన్యులు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో వాజేడు మండలం కొప్పునూరు గ్రామ సమీపంలోని గుండ్లవాగు బ్రిడ్జి వద్ద అమర్చిన మందుపాతర కారణంగా చిట్టెం అచ్చాలు అనే వ్యక్తి బలవ్వగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

  • 2018లో కొంగాల అటవీప్రాంతంలో మందుపాతరకు ఓ పాడి ఆవు మృతిచెందింది.

  • 2019లో వెంకటాపురం మండలం ముకునూరుపాలెం అటవీప్రాంతంలో జరిగిన పేలుడులో దివ్యాంగుడైన సోయం పెంటయ్య చనిపోయారు.

  • ఈనెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో బాంబుపేలి జగన్నాథపురానికి చెంది న ఇల్లందుల ఏసు(55) మరణించాడు.

  • నక్సల్స్‌ మాత్రం మందుపాతరలను పెట్టడం, బూబీట్రాప్స్‌ వ్యూహాలను సమర్థించుకుంటున్నారు. ఏసు మృతి తర్వాత ఆత్మరక్షణ కోసం ఈ వ్యూహాలు తప్పవంటూ లేఖను విడుదల చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 05:31 AM

Advertising
Advertising