ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: వారికి రుణాలివ్వండి.. బ్యాంకర్లతో ఉపముఖ్యమంత్రి..

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:01 PM

ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు.

Deputy CM Mallu Bhatti Vikramarka

హైదరాబాద్, ఆగష్టు 20: ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు. రుణాల మాఫీలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తామన్నారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని భట్టి తెలిపారు. ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామన్నారు. రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని.. ఇది వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయని చెప్పుకొచ్చారు.


వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ. 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని.. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు.


ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడాలని బ్యాంకర్లకు సూచించారు భట్టి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. మొదటి క్వార్టర్‌లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులు ఇప్పటివరకు 40.62% వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి క్వార్టర్‌లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం అని అన్నారు.


భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని.. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి చెప్పారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల అంశం.. ఎఫ్‌సీఐకి వరిని సరఫరా చేసే రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2024 | 05:01 PM

Advertising
Advertising
<