ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Director Krish: డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్..

ABN, Publish Date - Mar 02 , 2024 | 07:35 AM

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించిన క్రిష్ విచారణకు హాజరై డ్రగ్స్ టెస్ట్‌ల కోసం శాంపిల్స్ ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల విచారణ జరిపి పోలీసులు శాంపిల్స్ తీసుకుని క్రిష్‌ను పంపించేశారు.

హైదరాబాద్: రాడిసన్ హోటల్ (Radisson Hotel) డ్రగ్స్ కేసు (Drugs Case)లో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ (Director Krish) విచారణకు హాజరయ్యారు. తాజాగా పోలీసులు (Police) ఇచ్చిన నోటీసులకు స్పందించిన క్రిష్ విచారణకు హాజరై డ్రగ్స్ టెస్ట్‌ల కోసం శాంపిల్స్ ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల విచారణ జరిపి పోలీసులు శాంపిల్స్ తీసుకుని క్రిష్‌ను పంపించేశారు. క్రిష్ బ్లడ్ యూరిన్ శాంపిల్స్‌ను పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. టెస్ట్‌లో పాజిటివ్ అని తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చిన విట్‌నెస్ కింద క్రిష్‌ను మరోసారి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

కాగా.. విచారణకు హాజరైన క్రిష్‌ను రాడిసన్‌ హోటల్‌లో పార్టీ, డ్రగ్స్‌ వాడకం గురించి డీసీపీ ప్రశ్నలడిగినట్లు తెలిసింది. వీటికి జవాబుగా వేరే కార్యక్రమానికి హాజరవాల్సి ఉందని, స్నేహితుడు రఘుచరణ్‌ ఫోన్‌ చేస్తే రాడిసన్‌కు వెళ్లానని, అరగంట మాత్రమే ఉన్నానని చెప్పినట్లు సమాచారం. తాను డ్రగ్స్‌ తీసుకోలేదని, పార్టీలో డ్రగ్స్‌ వాడిన విషయం తెలియదని వెల్లడించినట్లు తెలిసింది. సమయానికి అందుబాటులో లేకపోవడం, సినిమా చర్చలకు ముంబై వెళ్లడంతో పోలీసులు పిలిచినపుడు రాలేకపోయినట్లు సమాధానమిచ్చారు. తప్పు చేయనందునే జరిగిన విషయం వివరించడానికి వచ్చానని క్రిష్‌ చెప్పినట్లు తెలిసింది. వీటికి డీసీపీ సంతృప్తి చెంది.. డ్రగ్స్‌ పరీక్షలు కచ్చితంగా చేయాలని, సహకరించాలని కోరారు. సిద్ధమని క్రిష్‌ చెప్పడంతో.. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించాలని ఇన్‌స్పెక్టర్‌ను డీసీపీ ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 07:35 AM

Advertising
Advertising