TG Cabinet: హైడ్రాపై కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:19 AM
Telangana: హైడ్రాకు సంబంధిం సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధతపై కేబినెట్‌లో మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఉన్న విశేష అధికారాలు హైడ్రాకు ఇవ్వడంపై కేబినెట్ చర్చించునుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ మంత్రివర్గ (Telangana Cabinet Meeting) సమావేశం ఈరోజు (శనివారం) సాయంత్రం జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా హైడ్రాకు (HYDRA) సంబంధిం సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధతపై కేబినెట్‌లో మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.
Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు
రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు ఉన్న విశేష అధికారాలు హైడ్రాకు ఇవ్వడంపై కేబినెట్ చర్చించునుంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకు హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్, అధికారుల కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
CM Revanth Reddy: పేదలకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు..
ఆ మూడింటికీ ఆమోద ముద్ర
అలాగే మరికొన్ని అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. ధరణి కమిటీ చేసిన 54 సిఫారసులపైనా చర్చించి, అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. బీసీ కులగణన పై చర్చ జరుగనుంది. పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేరు పెట్టడంపై కూడా మంత్రిమండలిలో చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు.. అలాగే ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ మూడింటికీ మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 225 గ్రామ పంచాయతీలు, ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనంపైనా నేటి కేబినెట్‌లో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి...
KTR: ఇది ముమ్మాటికీ మోసం, నయవంచనే.. సర్కార్‌పై కేసీఆర్ విసుర్లు
Nithyanandarai: ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి.. ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి సూచన
ReadTelangana NewsAndTelugu News
Updated Date - Sep 20 , 2024 | 11:32 AM